కేసీఆర్‌ను టచ్‌చేస్తే మాడి మసైపోతావ్‌:బండిపై మోత్కుపల్లి ఫైర్

147
mothukupalli
- Advertisement -

సీఎం కేసీఆర్‌ను టచ్ చేస్తే మాడి మసైపోతావ్ అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని హెచ్చరించారు టీఆర్ఎస్ నేత,మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు. తెలంగాణ భవన్‌లో మీడియా మాట్లాడిన మోత్కుపల్లి…బీజేపీ డబ్బుల ప్రోగ్రాంలో డప్పులు కొట్టేవారిలో ఒక్కరూ డప్పులు కొట్టేవారు లేరన్నారు. దళితబంధు కావాలని కొడుతున్నారా? వద్దని కొడుతున్నారా? చెప్పాలని ప్రశ్నించారు. దళితబంధు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉందా?.. బీజేపీ నేతలకు సిగ్గు ఉందా? అని మండిపడ్డారు.

కుల వివక్ష పోగొట్టేందుకు బీజేపీ ఎక్కడైనా ప్రయత్నం చేసిందా? అని ప్రశ్నించారు. బీజేపీ వల్లే కులవ్యవస్థ ముందుకు నడుస్తోందన్నారు. బీజేపీ నేతలకు బుద్ధి ఉందా? ఓట్ల కోసం గారడి వేషాలు మానుకోవాలన్నారు. నా అనుభవంలో చాలామంది సిఎంలను చూసాను…. దళితులకు వచ్చే లాభాన్ని అడ్డుకునే బీజేపీ వైఖరిని ఖండిస్తున్నా అన్నారు. దళితులకు అడ్డం వస్తే పడేసి తంతారు- బీజేపీ నేతలు పిచ్చి కుక్కల్లా అరుస్తున్నారని దుయ్యబట్టారు.

కేసీఆర్.. అంబేద్కర్ వారసుడిగా ముందుకు సాగుతున్నారు… బండి సంజయ్ కి సిగ్గులేదా? నాతో వస్తవా హుజురాబాద్ పోదాం అన్నారు. బండి సంజయ్ పిచ్చి వెధవ- కేసీఆర్ దళితబంధు ఇస్తానని అంటుంటే వినిపించడం లేదా? అన్నారు. ఒక రూపాయి ఇవ్వాలంటే లక్ష షరతులు పెడతారు… ఎస్సి కార్పొరేషన్- స్పెషల్ ఫండ్ వల్ల ఉపయోగం లేదు- కానీ దళితబంధు వల్ల ఉపయోగం ఉందన్నారు. దళితబంధు కు అడ్డుపడితే ఊర్లలోకి రానివ్వకుండా తొక్కిపెడతారన్నారు.

దేశంలో ఎవ్వరికీ అక్కరరాని పార్టీ బీజేపీ… దళితబంధు పథకం దేశమంతా బీజేపీ అమలు చెయ్యాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోందన్నారు. మిలియన్ మార్చ్ ఎందుకు పెడుతున్నారు? 2కోట్ల ఉద్యోగాలు మోడీ ఇచ్చారా?… ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకపోను ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నారని మండిపడ్డారు.పెట్రోల్- డీజిల్ ధరలు రోజువారీగా పెంచడానికి సిగ్గు అనిపించడం లేదా?, 450 రూపాయలున్న గ్యాస్ ధరలు 1000కి పెరిగాయన్నారు.

- Advertisement -