దసరా బరిలో ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’..

124
- Advertisement -

బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో అఖిల్‌ అక్కినేని, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌బ్యాచ్‌లర్‌’.గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమాను బన్నీ వాసు, వాసువర్మ నిర్మిస్తున్నారు. ఈ మూవీ విడుదలకు ముస్తాబై చాలా రోజులైంది. కానీ కరోనా కారణంగా వాయిదాపడుతూ వచ్చింది. తాజాగా ఈమూవీ అక్టోబర్‌ 15న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు నిర్మాతలు వెల్లడించారు.

ఇదొక రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలకు మంచి స్పందన లభిస్తోంది. సినిమా కూడా నచ్చుతుంది అని దర్శకుడు ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ అన్నారు. దసరాకు థియేటర్లలో కలుద్దామన్నారు హీరో అఖిల్‌. ‘‘కుటుంబంతో చూసే చక్కటి వినోదాత్మక చిత్రమిది’’ అని పూజా హెగ్డే చెప్పారు. ఆమని, మురళీశర్మ, జయప్రకాశ్‌, ప్రగతి తదితరులు ప్రధాన తారాగణంగా అల్లు అరవింద్‌ సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి గోపీసుందర్‌ సంగీత దర్శకుడు.

- Advertisement -