నాచు తింటే ఎన్ని లాభాలో తెలుసా ?

30
- Advertisement -

సముద్రపు నాచును తినడం మన దేశంలో చాలా తక్కువ. కానీ బయటి దేశాల్లో మాత్రం దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. సముద్రపు నాచును సూప్ లా చేసుకొని సేవిస్తుంటారు. అంతే కాకుండా వివిధ ఆహార పదార్థాల తయారీలో కూడా ఉపయోగిస్తుంటారు. సముద్రపు నాచు అనేది ఒక రకమైన బ్యాక్టీరియా అయినప్పటికీ దీనిని తినడానికి ప్రధాన కారణం ఇందులో ఉండే పోషకాలే. ఒక గ్రాము సముద్రపు నాచులో మన శరీరానికి అవసరమైన అయోడిన్, ఐరన్, మెగ్నీషియం, జింక్, సెలీనియం, వంటి పోషకాలు సమృద్దిగా లభిస్తాయి. అంతే కాకుండా విటమిన్ సి, బి6, ఏ, డి.. వంటివి కూడా లభిస్తాయి. అందుకే పాశ్చాత్య దేశాల్లో సముద్రపు నాచుకు విపరీతమైన డిమాండ్ ఉంది.

ఇంకా దీనిని వివిధ రకాల వ్యాధుల నివారణకు ఆయుర్వేద ఔషదలలో కూడా ఉపయోగిస్తారు. జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. అంతే కాకుండా ఆస్తమా, దగ్గు వంటి ఇతరత్రా శ్వాసకోశ సమస్యలకు చెక్ పెడుతుంది. ఇంకా ఇందులో ఉండే యాంటీ యాక్సిడెంట్లు, యాంటీ వైరల్ గుణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా సముద్రపు నాచులో స్పైరులినా అనే మూలకం లభిస్తుంది. ఇది శరీరంలోని క్యాన్సర్ కారకాలను దూరం చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇంకా కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు వంటి సమస్యలను కూడా దూరం చేస్తుందట. సముద్రపు నాచులో కాపర్, ఒమేగా 3, ఒమేగా 6, బీటా కేటోరిన్, పైకొసైనిన్, థయామిన్ వంటి పోషకాలు అదనంగా లభిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే సముద్రపు నాచు ఎక్కువగా తింటే ప్రమాదమే అని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో అయోడిన్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల థైరాయిడ్ సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందట. ఇంకా దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే డయేరియా, వాంతులు వంటి సమస్యలు కూడా ఏర్పడతాయని చెబుతున్నారు నిపుణులు.

గమనిక : ఈ సమాచారం మీ అవగాహన కొరకు ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. కాబట్టి దీనిని దృవీకరించడం లేదు. దీన్ని తినే విషయంలో ఆరోగ్య నిపుణుల సలహా మేరకు పాటించడం మంచిది.

Also Read:యూనిక్ కంటెంట్‌తో ‘ఈగల్’

- Advertisement -