బత్తాయి జ్యూస్ తాగితే..ఎన్ని లాభాలో!

20
- Advertisement -

భగ భగ మండే వేసవిలో చల్లటి పానీయాలు సేవించినప్పుడు కలిగే అనుభూతి మాటల్లో వర్ణించడం కష్టం. వేసవి ప్రారంభం కావడంతో రోడ్లపై ఎక్కడ చూసిన జ్యూస్ షాపులు కళకళలాడుతుంటాయి. అక్కడ మనకు ఇష్టమైన పండ్లతో చేసిన జ్యూస్ సేవిస్తూ కాస్త సేద తీరుతుంటాము. ఐతే వేసవిలో ఇమ్యూనిటీ శాతాన్ని పెంచి డీహైడ్రేషన్ ను తగ్గించే పానీయాలను సేవించడం మరి మంచిది. అలా ఇమ్యూనిటీని పెంచడంలో బత్తాయి జ్యూస్ మొదటి ప్లేస్ లో ఉంటుంది. బత్తాయి పండులో ఎక్కువగా సిట్రిక్ ఆమ్లం, విటమిన్ సి ఉంటుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో సహాయ పడుతుంది. అందుకే చాలమంది బత్తాయి జ్యూస్ తాగడానికి అమితంగా ఇష్టపడుతుంటారు. రుచిలో పులుపు, ఒగరు, తీపి కలగలిపి ఉండే బత్తాయి జ్యూస్ తాగడం వల్ల డిహైడ్రేషన్ బారి నుంచి తప్పించుకోవచ్చు.

బత్తాయిలో ఉండే విటమిన్ సి శరీరంలో ఫ్రీరాడికల్స్ ను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఇంకా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచి ఆరోగ్యాన్ని క్రమబద్దీకరిస్తాయి. వేసవిలో శరీరంలో నీటి శాతం తక్కువగా ఉండడం వల్ల చాలమంది మలబద్దకంతో బాధ పడుతుంటారు. అలాంటి వారు ప్రతిరోజూ బత్తాయి జ్యూస్ తాగితే ఆ సమస్య దూరమవుతుంది. ఇంకా వేసవిలో తరచూ ఏర్పడే మూత్ర సమస్యలు అనగా మూత్రంలో మంట, మూత్రం రంగు మారడం వంటి రుగ్మతలను కూడా బత్తాయి జ్యూస్ దూరం చేస్తుంది. షుగర్ వ్యాధి గ్రస్తులకు బత్తాయి జ్యూస్ ఒక దివ్య ఔషధం.ఇందులో ఉండే సిట్రిక్ ఆమ్లం రక్తంలోని షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారు ప్రతిరోజూ బత్తాయి జ్యూస్ తాగితే వేగంగా బరువు తగ్గవచ్చు.. కాబట్టి వేసవిలో ఇతర పండ్ల రసాలతో పోల్చితే బత్తాయి జ్యూస్ తాగడం అన్ని విధాలుగా ఎంతో మేలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

Also Read:తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో..హైలైట్స్ ఇవే

- Advertisement -