అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మరణించిన సాప్ట్ వేర్ ఉద్యోగి చరితారెడ్డి మృతిదేహన్ని స్వస్ధలం హైదరాబాద్ కు చేరుకుంది. నేరేడ్‌మెట్ నివాసానికి ఆమె డెడ్ బాడీని తరలించారు. కూతురు మృతదేహం చూసిన చరితారెడ్డి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చరిత రెడ్డి మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ఫేస్ బుక్ మాధ్యమంగా స్నేహితులు క్రౌడ్ ఫండింగ్ పేజ్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఎంతో మంది దాతలు తమకు తోచినంత డబ్బును అందించగా, ఆ డబ్బుతో విమానంలో చరితా రెడ్డి మృతదేహాన్ని హైదరాబాద్ పంపారు. ఈ రోజు సాయంత్రం ఆమె అంత్యక్రియలు జరుగనున్నాయి. డిసెంబర్ 27న అమెరికాలోని మిచిగావ్ ముస్కేగాన్ లో కారులో వెళ్తున్న చరితారెడ్డి కారును వెనుక నుంచి వేరే కారు వచ్చి ఢికొట్టడంతో వెనుకసీటులో కూర్చున్న చరితారెడ్డి బ్రెయిన్‌రెడ్డి అయి మృతిచెందారు. చరితారెడ్డి చనిపోయినా ఆమె అవయవాలు 9 మందికి పున: జన్మనిచ్చాయి.