పవన్ కళ్యాణ్ కి ఉన్న అభిమానం చూసి ఈర్ష్య తోనో, పవన్ పై ఉన్న కోపంతోనో, ఎలాగైనా పవన్ పరువు తీయాలని ఆయన తల్లి ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు పవన్ విరోధులు. అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి ట్విట్టర్ లో ఓ ఫేక్ అకౌంట్ తో అంతర్జాలం లో వదిలారు. విషయం తెలుసుకున్న పవన్ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.
చంటబ్బాయ్ అనే అకౌంట్ నుంచి పవన్ కళ్యాణ్ తల్లి ఫోటోలను అప్ లోడ్ చేయగా హైదరాబాద్ కు చెందిన శ్రవణ్ అనే వ్యక్తి వాటిని చూసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసాడు. వెంటనే సైబర్ క్రైమ్ దృష్టికి తీసుకెళ్లిన పోలీసులు ఆ అకౌంట్ ని బ్లాక్ చేయించి ఐపీ అడ్రస్ కనుక్కునే పనిలో ఉన్నారు.
పవన్ పై కోపం ఉంటే పవన్ కళ్యాణ్ ను విమర్శించండి, అంతేగాని ఆయన తల్లిని వివాదాల్లోకి ఎందుకు లాగుతున్నారంటూ సోషల్ మీడియాలో పవన్ అభిమానులు కోపోద్రిక్తులవుతున్నారు. ఈ పని చేసింది ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలంటూ సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.