మోదీ ప్రపంచ అత్యుత్తమ నాయకుడు: మార్నింగ్‌ కన్సల్ట్‌

92
modi
- Advertisement -

అంతర్జాతీయ మార్నింగ్‌ కన్సల్ట్‌ సంస్థ ప్రతి ఏటా నిర్వహించే అత్యుత్తమ ఉత్తమ ప్రజా నాయకుడు ఏవరినే దానిపై సర్వే నిర్వహిస్తుంది. 2022వ సంవత్సరానికి గాను భారత ప్రధాని మోదీని ఈ సర్వే ద్వారా మరోసారి అగ్రస్థానంలో నిలబెట్టింది. ఈ సర్వే ప్రకారం 75శాతం ప్రజామోదం కలిగిన అత్యుత్తమ నాయకుడిగా నిలిచారు. మెక్సికన్‌ ప్రెసిడెంట్‌ ఆండ్రెస్‌ మాన్యుయెల్‌ లోపెజ్‌ ఒబ్రాడోర్‌, ఇటలీ ప్రధాని మారియో డ్రాగీ వరుసగా రెండు,మూడు స్థానాల్లో నిలిచారు.

మొత్తం 22మంది ప్రపంచ నాయకులు ఉన్న జాబితాలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ 41శాతం రేటింగ్‌తో ఐదవ స్థానంలో ఉన్నారు.బైడెన్‌ తర్వాత కెనడా అధ్యక్షుడు జస్టిన్‌ ట్రూడో 39శాతం, జపాన్‌ ప్రధానిఫుమియో కిషిడా38శాతంతో నిలిచారు. 2021నవంబర్‌ లో ను ప్రధాని మోదీ అత్యంత ప్రజాదరణ పోందిన ప్రపంచ నాయకుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. ఆయా దేశాలల్లో జరిగే అభివృద్ధి, ప్రణాళికలు, ఎన్నికల సమయంలో ఓటింగ్‌ శాతం, అక్షరాస్యుల ప్రతిపాదికను, వయస్సు, లింగం, భౌగోళిక పరిస్థితులను బట్టి ఈ ర్యాంకింగ్‌ను కేటాయిస్తామని మార్నింగ్‌ కన్సల్ట్‌ సంస్థ తెలిపింది.

- Advertisement -