కాళేశ్వరం పనుల రుణానికి ప్రభుత్వ అనుమతి

911
kaleshwaram
- Advertisement -

కాళేశ్వరం అదనపు పనులకు అవసరమయ్యే రుణానికి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. మూడో టీఎంసీ ఎత్తిపోతకు అవసరమైన పనుల కోసం రుణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పోరేషన్‌ నుంచి రుణం తీసుకునేందుకు కాళేశ్వరం కార్పోరేషన్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

రుణం తీసుకునేందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వనుంది. దీనిని సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి జారీ చేశారు. మేడిగడ్డ జలాశయం నుంచి శ్రీపాద ఎల్లంపల్లి వరకు మూడో టీఎంసీ ఎత్తిపోత పనుల కోసం 4657.95 కోట్ల రూపాయలు అవసరం కానుంది.

మిడ్ మానేరు నుంచి కొమురవెల్లి మల్లన్నసాగర్ వరకు మూడో టీఎంసీ ఎత్తిపోత పనుల కోసం 14093.43 కోట్ల రూపాయలు అవసరం కానున్నాయి.

- Advertisement -