- Advertisement -
తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజుల వరకు వాతావరణ వివరాలను వెల్లడించింది వాతావరణ శాఖ. ఇవాళ , రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని…ఎల్లుండి అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఇవాళ ఆదిలాబాద్, కోమురంభీం–ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్-పట్టణ, వరంగల్-గ్రామీణ మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతిభారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.రేపు, ఎల్లుండి ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
- Advertisement -