టీడీపీలో చేరిన ఇద్దరు మాజీ ఎంపీలు

6
- Advertisement -

వైసీసీకి మరో షాక్ తగిలింది. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఇద్దరు మాజీ ఎంపీలు మోపిదేవి వెంకట రమణ, బీదా మస్తాన్‌రావు టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో పార్టీలో చేరారు. వారిద్దరికీ చంద్రబాబు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు.

ఆగస్టులో ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్‌రావు తమ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయగా.. వారి రాజీనామాలను రాజ్యసభ ఛైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ ఆమోదించిన సంగతి తెలిసిందే. వీరితో పాటు వైసీపీ తరపున రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆర్ కృష్ణయ్య కూడా తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన బీసీ ఉద్యమం కోసం పదవికి గుడ్ బై చెప్పారనే టాక్ వచ్చింది. అయితే పార్టీలో సీనియర్ నేతగా ఉన్న మోపిదేవి రాజీనామా చేయడం వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ అనే చర్చ జరుగుతోంది.

Also Read:KTR: యువతను పిచ్చోళ్లను చేస్తున్న రేవంత్!

- Advertisement -