పెసర మొలకలతో ఆరోగ్యం

93
- Advertisement -

శరీరం పుష్టిగా తయారవడానికి ప్రతిరోజూ మొలకలు తినాలని న్యూట్రీషియన్స్ చెబుతూ ఉంటారు. మొలకలలో బాడీకి అవసరమైన అన్నీ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో కొవ్వు శాతం తక్కువగా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా మొలకెత్తిన గింజలలో విటమిన్ ఏ, సి, బి6, బి1, విటమిన్ కె వంటి పోషకాలతో పాటు ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్, కాల్షియం వంటి ఖనిజాలు కూడా సమృద్దిగా ఉంటాయి. అందుకే అత్యంత శక్తివంతమైన అల్పాహారాలలో మొలకెత్తిన గింజలు ముందు వరుసలో ఉంటాయి. ఇక మొలకెత్తిన గింజలలో చాలా రకాలే ఉన్నప్పటికి పెసర మొలలకను ఎక్కువగా తినాలని నిపుణులు చెబుతుంటారు.

పెసర మొలకలలో ఆరోగ్యాన్ని పెంచే గుణాలతో పాటు వివిధ అనారోగ్య సమస్యలను దూరం చేసే గుణాలు కూడా ఉంటాయట. పెసర మొలకలలో విటమిన్ కె కాస్త అధికంగా ఉంటుంది. ఇది మన శరీరంలో గాయాల నుంచి రక్తం గడ్డ కట్టడానికి ఎక్కువగా తోడ్పడుతుంది. మొలకెత్తిన పెసర గింజలు గుండె ఆరోగ్యాని ఎంతో సహాయ పడతాయని పలు పరిశోదనల్లో వెల్లడైంది. ఈ పెసర మొలకలు రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచి గుండెకు రక్త ప్రసరణను మెరుగు పరుస్తాయి. ఈ మొలకలలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు ప్రతిరోజూ ఉదయం ఒక కప్పు పెసర మొలకలు తినడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది.

తద్వారా వేగంగా బరువు తగ్గవచ్చు. పెసర మొలకలు జీర్ణ వ్యవస్థను కూడా క్రమబద్దీకరిస్తాయి. ప్రతిరోజూ పడగడుపున ఈ మొలకలను తింటే మలబద్దకం దురమౌతుందట. పెసర మొలకలు తినడం వల్ల ఎముకలకు శక్తి పెరుగుతుంది. అందువల్ల కీళ్ల సమస్యలు దరి చెరకుండా ఉంటాయి. మహిళల్లో ఈ పెసర మొలకలు మరింత ఆరోగ్యాన్ని కలుగజేస్తాయని నిపుణులు చెబున్నారు. మహిళల్లో హార్మోన్ల సమతుల్యత, పునరుత్పత్తి సమస్యలు, ఋతు క్రమ సమస్యలు, వంటి అనేక రకాల రుగ్మతలను దూరం చేయడంలో పెసర మొలకలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందువల్ల ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం ఇతరత్రా స్నాక్స్ తినడం కన్నా మొలకలు తినడం మంచిదని నిపుణులు చెబుతున్నా మాట.

Also Read:డోనాల్డ్ ట్రంప్‌కు మస్క్ భారీ విరాళం

- Advertisement -