‘మొంథా’ ఎఫెక్ట్.. 127 రైళ్లు రద్దు

5
- Advertisement -

మొంథా తుపాను ఎఫెక్ట్‌తో 127 రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. భారీ వర్షాలు, తుఫాను ప్రభావం కారణంగా పలు రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే . 127 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయడంతో పాటు మరో 14 రైళ్లు దారి మళ్లించారు.

తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా గుండ్రాతిమడుగులో నిలిచింది కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌, డోర్నకల్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌. ఏపీలోని కృష్ణా జిల్లా కొండపల్లిలో సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది.

మొంథా తుఫాన్‌పై అధికారులను అప్రమత్తం చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గ్రౌండ్ లో పర్యటనకు అధికారులు సిద్ధంగా ఉండాలి… అత్యవసరమైతే తప్ప ఎవరూ సెలవు పెట్టొద్దు అని సూచించారు కోమటిరెడ్డి. పోలీసు, రెవెన్యూ, విద్యుత్, ఇరిగేషన్ శాఖలతో సమన్వయం చేసుకోవాలి … సర్కిల్స్ వారీగా పరిస్థితులను మానిటరింగ్ చేయాలి అన్నారు.

Also Read:రఫేల్ యుద్ధ విమానంలో రాష్ట్రపతి

- Advertisement -