తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ఈ నెల 19 లేదా 20వ తేదీలలో ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి శ్రావణి తెలిపారు. తెలంగాణలో వడగాలుల తీవ్రత చాలా అధికంగా ఉంటుందని అన్నారు. ఇదే రకమైన వాతావరణం మరో మూడు రోజుల వరకు ఉంటుందని స్పష్టం చేశారు. నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత జూలై రెండవ వారం నుంచి అధికంగా వర్షాలు ఉంటాయని పేర్కొన్నారు.
Also Read: గ్రీన్ ఛాలెంజ్‌లో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
వాతావరణ శాఖ ఇచ్చిన లాంగ్ రైన్ఫల్ ఫోర్ క్యాస్ట్ ప్రకారం 96శాతానికిపైగా వర్షపాతము నైరుతి రుతుపవనాల ద్వారా సంభవిస్తుందని అన్నారు. అయితే ఎలినినో ఏర్పడిన రుతుపవనాలపై పెద్దగా ప్రభావం ఉండదని అన్నారు. 2020లో ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు వచ్చిన అధిక వర్షపాతమే నమోదు చేసినట్టు గుర్తు చేశారు. ఎల్‌నినో ప్రభావం సెప్టెంబర్ నాటికి ఒక్క క్లారిటీ వస్తుందని అన్నారు.
Also Read: తృణధాన్యాలు…మోదీ ఫాల్గుణి షా పాట