తెలుగు రాష్ట్రాల్లో నేడు వర్షాలు..

209
rains
- Advertisement -

నైరుతి రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఉక్కపోత నుంచి బయటపడ్డారు. హైదరాబాద్‌లో నిన్నటినుండి కుండపోత వర్షం కురుస్తుండగా ఇవాళ ఉత్తరాంధ్ర, రాయలసీమలో వర్షాలు పడనున్నాయి.

సూర్యాపేట, మహబూబ్‌నగర్, నారాయణ పేట, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాలో భారీ వర్షాలు పడొచ్చని అధికారులు అంచనా వేశారు.బుధవారం ఆదిలాబాద్ జిల్లా పొచ్చర్లలో అత్యధికంగా 12 సెంటీ మీటర్ల వర్షం పడినట్లు అధికారులు తెలిపారు. అలాగే రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో 7 సెంటిమీటర్లు, ఆదిలాబాద్ జిల్లా సొనాలలో 6 సెంటీమీటర్లు, మెదక్ జిల్లా పాపన్నపేటలో 6 సెంటీమీటర్లు వర్షం కురిసింది.

హైదరాబాద్‌లో వనస్థలిపురం, ఎల్బీ నగర్, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్ తదితర చోట్ల పెద్ద వాన పడింది. శేరిలింగంపల్లిలో 4.5 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. బాలానగర్‌లో 3.5, కూకట్‌పల్లిలో 3 సెంటిమీటర్ల వర్షం పడింది.

- Advertisement -