కేరళను తాకిన నైరుతి..

19
- Advertisement -

 కేరళ తీరాన్ని తాకాయి నైరుతి రుతుపవనాలు. వాతావరణ శాఖ అంచనా వేసిన ఒక రోజు ముందుగానే కేరళ తీరాన్ని తాకాయి. రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉండటంతో తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకులం, త్రిసూర్, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించింది.తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల్లో ప్రవేశించే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించకముందే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతుండడం గమనార్హం.

నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ 1-4 తేదీల మధ్య కేరళ తీరాన్ని తాకుతాయి. ఈ సారి ముందుగానే తాకాయి. ఆ తర్వాత నైరుతి రుతుపవనాలు దేశంలోని పలు రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తాయి.

Also Read:మందు కొట్టిన బాలయ్య..నిర్మాత క్లారిటీ!

- Advertisement -