- Advertisement -
ఎండవేడిమితో అల్లాడిపోతున్న ప్రజలకు గుడ్ న్యూస్. ఈ ఏడాది ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. ప్రతి సంవత్సరం జూన్ 1న కేరళను తాకే రుతుపవనాలు ఈసారి మూడు రోజుల ముందుగా అడుగుపెట్టాయి.
దక్షిణ అరేబియా సముద్రం, లక్షద్వీప్‌లోని మిగిలిన ప్రాంతాలు, దక్షిణ తమిళనాడు, గల్ఫ్ ఆఫ్ మన్నార్‌లోని కొన్ని ప్రాంతాలకు కూడా ఇవి విస్తరించినట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. మరో వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాలను కూడా రుతుపవనాలు తాకుతాయన్నారు.
అరేబియా సముద్రం నుంచి పడమర దిశగా గాలులు 25 నుంచి 35 కి.మీ. వేగంతో కేరళపైకి వీస్తుండడంతో రుతుపవనాల రాకను వాతావరణ శాఖ నిర్ధారించింది. వాతావరణం అనుకూలిస్తే జూన్ తొలి వారంలో ఏపీలోని రాయలసీమను తొలుత రుతుపవనాలు తాకుతాయని వెల్లడించారు.
- Advertisement -