దేశంలోనే తొలిసారి…మానిటరింగ్ హబ్

110
- Advertisement -

దేశంలోనే తొలిసారి రాష్ట్రంలోని పీహెచ్‌సీల్లో పేదలకు అందించే వైద్యసదుపాయాల గురించి తెలుసుకునేందుకు మానిటరింగ్ హబ్‌ని ప్రారంభించామని తెలిపారు మంత్రి హరీశ్‌ రావు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆఫీసులో మానిటరింగ్ హబ్ ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన హరీశ్.. రాష్ట్రంలోని 887 PHC ల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేశాం… డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, TSMSIDC అనుసంధానం చేశాం. ఉన్నతాధికారులు ఎక్కడి నుంచే మానిటర్ చేసే అవకాశం కలుగుతుందన్నారుజ

ఏవైనా ఔట్ బ్రేక్స్ కలిగినప్పుడు సలహాలు సూచనలు ఇస్తారని చెప్పారు. డాక్టర్లు తమ phc లోని ఫార్మసీ, ల్యాబ్ ను మానిటర్ చేసే అవకాశం కలుగుతుందన్నారు. మెడికల్ కాలేజీలు, జిల్లా హాస్పిటల్ తో సంప్రదించి స్పెషాలిటీ సేవలు అందించే అవకాశం కలుగుతుందన్నారు. సీసీ కెమెరాలతో సెక్యూరిటీ, సేఫ్టీ ఉంటుందని… ఇలాంటి వ్యవస్థ ఏర్పాటు చేయడం దేశంలో మొదటిసారి అన్నారు. తెలంగాణలో ప్రాథమిక వైద్య రంగాన్ని సీఎం కేసీఆర్ బలోపేతం చేస్తున్నారన్నారు.

43 పిహెచ్సి లకు 67 కోట్లతో కొత్త బిల్డింగ్ లను మంజూరు చేశాం… 372 పిహెచ్ సి ల మరమ్మతులను 43 కోట్ల 18 లక్షలతో చేపట్టామన్నారు. 1239 సబ్ సెంటర్ల కొత్త భవనాలకు శాంక్షన్ ఇచ్చాము. ఒక్కో దానికి 20 లక్షల ఖర్చు చేస్తున్నాం. అన్నిటికి కలిపి మొత్తంగా 247 కోట్లు వెచ్చించాం. 1497 సబ్ సెంటర్ లను ఒక్కోదానికి 4 లక్షల చొప్పున 59 కోట్లతో మరమ్మత్తులు చేపట్టామన్నారు. పల్లె దవాఖానల కోసం 1569 పోస్టుల నియామక ప్రక్రియ త్వరలో మొదలవుతుందన్నారు. రాష్ట్రంలో 331 బస్తి దవాఖానలు పనిచేస్తున్నాయి. వీటిని 500 కు పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు. త్వరలో స్టాఫ్ నర్స్, 1165 స్పెషలిస్ట్ డాక్టర్ నోటిఫికేషన్ త్వరలో ఇస్తాం అన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -