అఖిల్‌కి మోనాల్ ముద్దుల వర్షం!

35
akhil

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 73 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 73వ ఎపిసోడ్‌లో భాగంగా అఖిల్ బర్త్ డేని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు ఇంటి సభ్యులు. ముఖ్యంగా మోనాల్‌…అఖిల్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చింది.

మొద‌ట కేక్ ఎవ‌రికి తినిపిస్తాడు అన్న స‌స్పెన్స్‌కు తూట్లు పొడుస్తూ కేకు ముక్క తనే తిన్నాడు. త‌ర్వాత మోనాల్ అఖిల్‌ను హ‌త్తుకుని తొలిసారిగా ముద్దుల వర్షం కురిపించింది.మోనాల్ ముద్దు రుచి చూశాక.. అఖిల్ అబ్బా రోజూ బర్త్ డే ఉంటే బాగుండు.. అంటూ తన మనసులో మాటను బయటపెట్టగా మోనాల్ తెగ సిగ్గుపడిపోయింది.

ఇక‌ ఈ సెల‌బ్రేష‌న్స్‌లో సోహైల్ ఎక్క‌డా క‌నిపించ‌లేదు. అయితే పాత గొడవల్ని పక్కన పెట్టేసి అఖిల్‌కి బర్త్ డే విషెష్ అందించాడు అభిజిత్.