మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ మరోసారి స్పాట్‌లైట్‌లోకి వచ్చారు. మోహన్ లాల్ – శోభన ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం తుడరుం (Thudarum). సినిమా ప్రమోషన్‌లో భాగంగా విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
దర్శకుడు తరుణ్ మూర్తి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఎం. రంజిత్ నిర్మించారు. ఓ ఎమోషనల్ జర్నీగా, భావోద్వేగాలు, డ్రామా, హృదయాన్ని తాకే కథనంతో నిండిన ఒక మౌలికమైన అనుభూతిని అందించనుందని ట్రైలర్ ఆధారంగా తెలుస్తోంది.
ట్రైలర్‌లో మోహన్‌లాల్ ఒక టాక్సీ డ్రైవర్‌గా, కుటుంబానికి అంకితమైన తండ్రిగా కనిపించగా కారు, అతని కుటుంబాన్ని కేంద్రంగా చేసుకుని కథ నడుస్తుందని తెలుస్తోంది. నడిచే ఈ కథలో మమకారం, సస్పెన్స్ రెండూ సమపాళ్లలో ఉండేలా అనిపిస్తోంది. దర్శకుడు తరుణ్ మూర్తి భావోద్వేగాలతో నిండిన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
Also Read:BRS సభ..చరిత్రలో నిలిచిపోతుంది: కేటీఆర్

