చంద్రబాబు..మాట నిలబెట్టుకో

247
mohanbabu fires Chandrababu
- Advertisement -

ఏపీ సీఎం చంద్రబాబుపూ విమర్శలు గుప్పించారు సినీనటుడు మోహన్ బాబు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు నిలబెట్టుకోలేదని విద్యాభివృద్ధి విషయంలో ఏపీ సర్కార్‌కు చిత్తశుద్దిలేదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినా పట్టించుకోలేదని తెలిపారు. సీఎం చంద్రబాబు అంటే నాకు ఇష్టం. అయినా మాకు ఫీజు బకాయిలు చెల్లించలేదు. చంద‍్రబాబు అనేకసార్లు మా కాలేజీకి వచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ 2014 నుంచి 2018 వరకూ రూ.19 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

నాకు ఏ కులం లేదని అందరివాడినని తెలిపారు. నాణ్యత లేని విద్యను ఇవ్వనని తాను రాజకీయం కోసం మాట్లాడలేదు. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. లేకుంటే మరింత ఆందోళనకు సిద్ధమని స్పష్టం చేశారు.

తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుండటంతో వైసీపీ అని ముద్రవేసే అవకాశం ఉందని అయితే తాను ఏ పార్టీలో లేనని స్పష్టంచేశారు. తన వ్యాఖ్యల వెనుక ఏ రాజకీయ పార్టీ ప్రోద్భలం లేదన్నారు.

- Advertisement -