మోహన్ లాల్-మమ్ముట్టి ..క్రేజీ ప్రాజెక్ట్!

4
- Advertisement -

మలయాళ సినిమా చరిత్రను తిరగరాయడానికి సిద్ధంగా ఉన్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మోహన్ లాల్ జ్యోతి ప్రజ్వలనతో అధికారికంగా ప్రారంభమైంది. మహేష్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రం రెండు దశాబ్దాల తర్వాత మమ్ముట్టి, మోహన్‌లాల్‌లను స్క్రీన్స్ పైకి తీసుకువచ్చింది. ఈ లెజెండ్స్‌తో పాటు ప్రముఖ స్టార్స్ ఫహద్ ఫాసిల్, కుంచాకో బోబన్, నయనతార తదితరులు ఉన్నారు, ఇది పాన్ ఇండియా మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలిచింది.

మోహన్ లాల్ అంతకుముందే శ్రీలంక చేరుకున్నారు. ఇటీవల మమ్ముట్టి, కుంచాకో బోబన్ చేరడంతో, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం దాని నిర్మాణాన్ని ప్రారంభించింది. వేడుకలను సహ నిర్మాతలు సుభాష్ జార్జ్ మాన్యువల్ స్విచ్ ఆన్ చేయగా, సి.ఆర్.సలీం తొలి క్లాప్ ఇచ్చారు. మోహన్‌లాల్‌తో పాటు, రాజేష్ కృష్ణ, సలీం షార్జా, అనురా మథాయ్, తేజస్ థంపి దీప ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు.

సహ నిర్మాతలు సి.ఆర్.సలీం, సుభాష్ జార్జ్ మాన్యుయెల్‌లతో కలిసి ఆంటో జోసెఫ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేష్ నారాయణన్ కథ అందించారు. రాజేష్ కృష్ణ, సి.వి. సారథి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు. రాంజీ పనికర్, రాజీవ్ మీనన్, డానిష్ హుస్సేన్, షాహీన్ సిద్ధిక్, సనల్ అమన్, రేవతి, దర్శన రాజేంద్రన్, సెరీన్ షిహాబ్, మద్రాస్ కేఫ్, పఠాన్‌ సినిమాలలో అలరించిన ఆర్టిస్ట్-డైరెక్టర్ ప్రకాష్ బెలవాడి వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ మనుష్ నందన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

ప్రొడక్షన్ డిజైన్ జోసెఫ్ నెల్లికల్, మేకప్ రంజిత్ అంబాడి, కాస్ట్యూమ్స్ ధన్య బాలకృష్ణన్, ప్రొడక్షన్ కంట్రోల్ డిక్సన్ పొడుతాస్. లీను ఆంటోని చీఫ్ అసోసియేట్ డైరెక్టర్‌గా, ఫాంటమ్ ప్రవీణ్ అసోసియేట్ డైరెక్టర్‌గా ఉన్నారు.

శ్రీలంక, లండన్, అబుదాబి, అజర్‌బైజాన్, థాయ్‌లాండ్, విశాఖపట్నం, హైదరాబాద్, ఢిల్లీ , కొచ్చితో సహా పలు లొకేషన్‌లలో 150 రోజుల పాటు ఈ చిత్రాన్ని చిత్రీకరించనున్నారు. ANN మెగా మీడియా ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు.

Also Read:సీఎం రేవంత్ రెడ్డి ఉన్న అరెస్ట్ చేయాల్సిందే: రాహుల్

- Advertisement -