- Advertisement -
మలయాళ నటుడు మోహన్ లాల్ మానవత్వాన్ని చాటుకున్నారు. తన 65వ పుట్టినరోజు సందర్భంగా రెండు కీలకమైన సేవా కార్యక్రమాలను ప్రకటించి తన గొప్ప మనసును చాటుకున్నారు.
కేరళలో కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న నిరుపేద చిన్నారులకు అతి తక్కువ ఖర్చుతో కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు చేయించనున్నట్లు ప్రకటించారు. చాలా మంది చిన్నారులు కాలేయ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అన్నారు. వారిలో అనేకమందికి ఈ ఆపరేషన్ అత్యవసరం. అలాంటి వారందరికీ తన ఫౌండేషన్ అండగా నిలుస్తుందని తెలిపారు.
తన విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. 1960 మే 21న జన్మించిన మోహన్‌లాల్ నాలుగు దశాబ్దాలకు పైగా వెండితెరపై అలరిస్తున్నారు.
Also Read:TTD:హనుమాన్ జయంతి వేడుకలు
- Advertisement -

