మోహన్ బాబు వచ్చేస్తున్నాడు..!

61
mohan babu
- Advertisement -

డైలాగ్ కింగ్ మోహ‌న్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కుతున్న చిత్రం స‌న్ ఆఫ్ ఇండియా. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ , శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్ పై డైమండ్ రత్న బాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి మంచు విష్ణు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో మోహన్ బాబుతో పాటు శ్రీకాంత్, ప్రగ్యా జైస్వాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో తనికెళ్ళ భరణి, ఆలీ, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, రాజా రవీంద్ర, రఘుబాబు కనిపించనున్నారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటివరకు మెజార్టీ షూటింగ్‌ పూర్తికాగా నిజజీవిత సంఘటనల ఆధారంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని అఫిషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. ఫిబ్రవరి 18న విడుదల కానుంది. ఇక చాలా రోజుల తరువాత తెరపైకి రాబోతున్న మోహన్ బాబు సినిమా గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

- Advertisement -