తాగుడుకు అలవాటుపడ్డావ్:మనోజ్‌పై మోహన్‌బాబు

2
- Advertisement -

మంచు మనోజ్‌తో వివాదం నేపథ్యంలో ఆడియో రిలీజ్ చేశారు నటుడు మోహన్ బాబు. నిన్ను గారాబంగా పెంచాను, ఏది అడిగినా ఇస్తే ఇప్పుడు గుండెల మీద తన్నావ్, నా మనసు ఆవేదనతో కుంగిపోతోందన్నారు. , నీకు జీవితంలో అన్నీ ఇస్తే నాకు అపకీర్తి తీసుకొచ్చావ్, నా ఇంట్లోకి అడుగుపెట్టడానికి నీకు అధికారం లేదు అన్నరు. నా ఆస్తులను ముగ్గురికి సమానంగా రాయాలా లేదా అనేది నా ఇష్టం అని తెలిపారు మోహన్ బాబు.

విష్ణు…తన యూనివర్సిటీలకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తుంటే నువ్వు దానిని మంటగలుపుతున్నావ్ అని దుయ్యబట్టారు. భార్య మాటలు విని తాగుడుకు అలవాటుపడ్డావని, కొన్ని మీడియా సంస్థలు రేటింగ్ కోసం ఉన్నది లేనిదీ రాస్తున్నాయని మండిపడ్డారు మోహన్ బాబు.

తన కష్టార్జితమైన ఇంట్లోకి మనోజ్​కు వచ్చే అధికారం లేదన్నారు. తన కుమార్తెను మనోజ్ ఎప్పుడైనా తీసుకెళ్లవచ్చని, రాకపోయినా తాను జాగ్రత్తగా పెంచుతానని…ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలుకుదామని సూచించారు.

ALso Read:పార్లమెంటరీ చరిత్రలోనే తొలిసారి!

- Advertisement -