నా స్నేహితుడు..గర్వపడుతుంటాడు

213
Mohan Babu praises Rangasthalm movie
- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన దృశ్యకావ్యం రంగస్థలం. ప్రీమియర్ షో నుంచే హిట్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కేవలం మూడు రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. సాధారణ ప్రేక్షకుడి నుంచి సినీ ప్రముఖులు,విమర్శకుల ప్రశంసలు వస్తుండటంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

తాజాగా డైలాగ్ కింగ్ మోహన్ బాబు..రంగస్థలం సినిమాపై ప్రశంసలు గుప్పించారు. రంగస్థలం గురించి మంచి విషయాలు వింటున్నానని తెలిపారు. త్వరలో నేనూ సినిమా చూస్తానని ట్వీట్ చేసిన మోహన్ బాబు…చిత్ర యూనిట్‌,చరణ్‌కి కంగ్రాట్స్ తెలిపాడు. నా ప్రియమైన స్నేహితుడు చిరంజీవి….. చరణ్‌ని చూసి గర్విస్తాడని కంగ్రాట్స్ అని తెలిపారు.

రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఓ అడుగుముందుకేసి దివ్యాంగులైన చిన్నారుల కోసం రంగస్థలం ప్రత్యేక షోలు ఏర్పాటుచేసింది. హైదారాబాద్‌‌లోని ఆశ్రయ ఆకృతి అనే స్వచ్చంద సంస్థలో వినికిడి లోపంతో బాధపడుతున్న దివ్యాంగ చిన్నారుల కోసం ప్రత్యేక షోలు ఏర్పాటుచేసిన ఉపాసన.. దగ్గరుండీ మరీ వారికి కావాల్సిన ఏర్పాట్లను చూసుకున్నారు. దివ్యాంగ చిన్నారులు రంగస్థలం సినిమాను చూసిన వీడియోను కూడా ఉపాసన పోస్ట్ చేసింది.

- Advertisement -