దక్షిణాది సినీ పరిశ్రమ గర్వించదగ్గ దర్శకులలో మణిరత్నం ఒకరు. జాతీయ స్ధాయిలో ఉత్తమ కథా చిత్రాల దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న మణిరత్నం ఇటీవలె భారీ మల్టీ స్టారర్ చిత్రం`నవాబ్` తో హిట్ కొట్టాడు. టాలీవుడ్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ హిట్ టాక్‌తో మంచి వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. తాజాగా మరో ఆసక్తికర కథతో ప్రేక్షకుల ముందుకువచ్చేందుకు సిద్దమవుతున్నారు.
ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ అనే చారిత్రక నవల ఆధారంగా మణిరత్నం సినిమాను తెరకిక్కంచనున్నారు. క్రీ.శ 947లోని మొదటి రాజరాజ చోళుని కథగా ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో కీలకమైన పాత్రలో డైలాగ్ కింగ్ మోహన్ బాబు నటించనున్నారట. మణిరత్నం సినిమా అంటే ఆ కథలో ఏదో ఒక కొత్తదనం ఉంటుంది. మరి ఈ సారి మణిరత్నం ఎలాంటి మ్యాజిక్ చేస్తారో అన్నది వేచిచూడాలి.
సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రంగా పొన్నియన్ సెల్వన్ ని రూపొందించాలనేది మణిరత్నం ప్లాన్. ఈ ప్రాజెక్ట్ కోసం విజయ్, విక్రమ్, శింబు లాంటి స్టార్ హీరోల పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఈ భారీ చిత్రం ఎప్పుడు పట్టాలెక్కుతుందో వేచి చూడాలి.

