ముద్దుకృష్ణకు మోహన్ బాబు సంతాపం

245
Mohan Babu Condolences to Gali Muddu Krishnama Naidu
- Advertisement -

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, ప్రస్తుత ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు హఠాన్మరణం తన మనసును తీవ్రంగా కలచివేసిందని సినీ నటుడు డాక్టర్ ఎం.మోహన్‌బాబు వెల్లడించారు. ముద్దుకృష్ణమ మృతికి తన సంతాపాన్ని తెలియజేస్తూ ఒక ప్రకటనను మోహన్‌బాబు విడుదల చేశారు.

Mohan Babu Condolences to Gali Muddu Krishnama Naidu

తిరుపతిలో చదువుకునే రోజుల్లో నేనూ, ఆయన ఒకే రూమ్ లో ఉండేవాళ్ళం. ఆయన బ్రదర్ నా క్లాస్ మేట్. నాకు అత్యంత సన్నిహితుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు. ఎలక్షన్స్ టైం లో ఆయన తరపున ఎన్నోసార్లు ప్రచారానికి కూడా వెళ్ళాను. అలాంటి మిత్రుడి హఠాన్మరణం నా మనసును కలచి వేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి, నియోజకవర్గ ప్రజలకు ఆ శిరిడి సాయినాధుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

- Advertisement -