సినీ నటుడు,వైసీపీ నేత మోహన్ బాబుపై మరోసారి పుకార్లు షికార్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎఫ్‌డీసీ) ఛైర్మన్‌గా మోహన్ బాబును నియమించారని సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వార్తలను ఆయన ఖండించారు.
ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా నన్ను నియమించారని వస్తున్న వార్తల్లో నిజంలేదు. అలాంటి వార్తలను నమ్మకండని లేఖలో పేర్కొన్నారు. ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే అధికారికంగా తెలియజేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం హైదరాబాద్ ఫిల్మ్ నగర్ టెంపుల్ ఛైర్మన్‌గా ఉన్నారు మోహన్ బాబు. విశాఖ శారదాపీఠం ఆధ్వర్యంలో ఈ టెంపుల్ రన్ అవుతోంది. ఇక శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి-ఏపీ సీఎం జగన్‌కు మధ్య సన్నిహిత సంబంధాలుండటం,జగన్‌కు మోహన్ బాబు బంధువు కూడా కావడంతో ఆయన్ని టీటీడీ ఛైర్మన్‌గా నియమిస్తున్నారంటూ వార్తలు వెలువడ్డాయి. కానీ తర్వాత అవన్నీ పుకార్లేనని తెలిపోయాయి. తాజాగా ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా నియమితులైనట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు మోహన్ బాబు.