త్వరలో మోహన్ బాబు బయోపిక్.. !

14
- Advertisement -

త్వరలో నటుడు మోహన్ బాబు బయోపిక్ రానుంది. ఇందుకు సంబంధించిన న్యూస్‌ను వెల్లడించారు మంచు విష్ణు. ప్రస్తుతం విష్ణు ప్రధానపాత్రలో కన్నప్ప సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమల్లో భాగంగా ఈ విషయాన్ని తెలిపారు.

సినీ ఇండస్ట్రీలో మోహన్ బాబు 50 ఏళ్ళ ప్రస్థానాన్ని పూర్తి చేసుకన్నారని.. ఇప్పటికిప్పుడు తన తండ్రి బయోపిక్ తీయాలనే ఆలోచన లేదని, కానీ భవిష్యత్ లో తీసే అవకాశం ఉందని తెలిపారు. అందులో తాను హీరోగా నటించనని, ఎందుకంటే తన తండ్రి పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేయలేనని అన్నారు.

మోహన్ బాబు బయోపిక్‌ తీస్తే మాత్రం కచ్చితంగా తమిళ హీరో సూర్యతో తీస్తానని చెప్పారు. తన బ్యానర్ లో సొంత నిర్మాణంలో ఆ బయోపిక్ రూపొందిస్తానని పేర్కొన్నారు.

Also Read:వెనక్కి రావాల్సిందే..అక్రమ వలసదారులపై మోదీ

- Advertisement -