ఆర్సీబీని వీడటంపై సిరాజ్!

0
- Advertisement -

రేపటి నుండి ఐపీఎల్ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈసారి గుజరాత్‌ టైటాన్స్‌ తరపున బరిలోకి దిగుతున్నాడు సిరాజ్. ఈ సందర్భంగా ఆర్సీబీని వీడటంపై ఎమోషన్ అయ్యారు.

విరాట్ కోహ్లీ నా కెరీర్ లో కీలక పాత్ర పోషించాడు… 2018-19లో నేను క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అతను నాకు చాలా మద్దతు ఇవ్వడమేకాకుండా.. ఎల్లప్పుడూ అండగా నిలిచాడని తెలిపాడు. కొత్త సీజన్ ముందు గుజరాత్ టైటాన్స్ లో చేరడం మంచి అనుభూతిని కలిగిస్తోందని అన్నారు. శుభ్ మన్ గిల్ సారథ్యంలో మాకు ఇక్కడ అద్భుతమైన జట్టు ఉందని పేర్కొన్నాడు.

ఏడు సీజన్ల పాటు ఆర్సీబీకి ఆడిన సిరాజ్ కు మాజీ సారథి విరాట్ కోహ్లీతో మంచి అనుబంధం ఉంది. మెగా వేలంలో సిరాజ్ ను గుజరాత్ టైటాన్స్ జట్టు రూ.12.50 కోట్లకు సిరాజ్‌ను కొనుగోలు చేసింది.

Also Read:బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన

- Advertisement -