షమికి చెడు జరగాలని తానెప్పుడు కోరుకోనని ఆయన భార్య హసీన్ జహాన్ తెలిపింది. షమి త్వరగా కోలుకోవాలని అల్లాను ప్రార్థిస్తున్నట్లు చెప్పింది. షమి తనకు శత్రువు కాదని…ఆయన ఆరోగ్యంగా లేకపోతే నేను సంతోషంగా ఉండలేనని తెలిపింది.
పోలీసు కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న షమి ఆదివారం బెంగాల్ మాజీ క్రికెటర్ అభిమన్యు ఈశ్వరన్ అకాడమీలో సాధన చేసి డెహ్రడూన్ నుంచి ఢిల్లీకి తిరిగి వస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో షమి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
కొంతకాలంగా షమి,ఆయన భార్యకు గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇతర మహిళలతో సంబంధాలు, మ్యాచ్ ఫిక్సింగ్, గృహహింస కింద షమిపై హసీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీటిపై విచారణ జరుగుతోంది. మరోవైపు బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చేపట్టిన దర్యాప్తులో షమి ఎలాంటి మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడలేదని తేల్చింది. దీంతో ఐపీఎల్‌లో ఆడేందుకు షమికి మార్గం సుగమమైంది.