విరాట్, రోహిత్‌ది బెస్ట్‌!

5
- Advertisement -

2027 వన్డే ప్రపంచకప్‌కు టైం దగ్గర పడుతోంది. భారత జట్టు ఇంకా తమ తుది జట్టును ఖరారు చేయలేదు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే విషయంపై మాజీ భారత క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. కోహ్లీ, రోహిత్ ఇద్దరూ తమ కెరీర్ చివరి దశలో ఉన్నారని….జట్టులో వారి భవిష్యత్తుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని గమనించడం ఆసక్తికరం.

దీనిపైనే మాజీ భారత క్రికెటర్ మహమ్మద్ కైఫ్ మాట్లాడుతూ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల విషయంలో నేను గ్యారెంటీ ఇస్తాను. రోహిత్ తన ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెడుతున్నాడు, అతను తనను తాను మరింత సన్నద్ధం చేసుకుని ఎలాగోలా ఆడతాడు. గాయాలు అనేవి యువకులతో సహా ఎవరికైనా అవుతాయి. అతనిలో ఆ కసి ఉంది…ఆ నిగ్రహం అతని బ్యాటింగ్‌లో కనిపిస్తోంది. ఒక కెప్టెన్‌గా, ఒక ఆటగాడిగా అతని బ్యాటింగ్ శైలి చాలా భిన్నంగా ఉంటుంది. అతని విధానం మారింది అని కైఫ్ పేర్కొన్నారు.

భారత జట్టు త్వరలోనే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు వెళ్లనుంది. అక్కడ తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలని చూస్తోంది. ఐర్లాండ్‌తో జరిగే రెండు టీ20 మ్యాచ్‌ల తర్వాత, మెన్ ఇన్ బ్లూ ఇంగ్లాండ్‌తో ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది.వన్డే మ్యాచ్‌లు జూలై 14, 16, 19 తేదీల్లో వరుసగా బర్మింగ్‌హామ్, కార్డిఫ్, లండన్‌లలో జరగనున్నాయి. 2027లో వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో, వచ్చే ఏడాది జరగబోయే ఈ ప్రతిష్టాత్మక టోర్నీ కోసం సిద్ధమవుతున్న భారత జట్టు ఈ సిరీస్‌లో అద్భుతంగా రాణించాలని ఆశిస్తోంది.

Also Read:#NBK112..గ్రాండ్ లాంచ్

ఆసక్తికరమైన విషయమేమిటంటే, వన్డే సిరీస్‌కు ముందు భారత్, ఇంగ్లాండ్ జట్లు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనున్నాయి. జూలై 1, 4, 7, 9, 11 తేదీల్లో జరిగే ఈ టీ20 మ్యాచ్‌ల్లో వైభవ్ సూర్యవంశీ, తిలక్ వర్మలతో పాటు కొత్తగా నియమితుడైన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా బరిలోకి దిగనున్నారు.

- Advertisement -