ఇండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్, బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారు. కానీ వారి పేర్లు మాత్రం ఒకేరకంగా ఉంటాయి. దీంతో సోషల్ మీడియాలో వీరిపై ఎప్పుడూ జోకులు వేసుకునేవారు. అయితే నెటిజన్ల నుండి సరదా కామెంట్లు వస్తున్నప్పటికీ ఈ ఇద్దరు కైఫ్‌లు మాత్రం ఎప్పుడూ కలుసుకోలేదు.ఇక వీరు ఇటీవల ఓ చోట కలుసుకొని అందరికీ షాకిచ్చారు. అంతేకాదు ‘కైఫ్’లు ఇద్దరు ఫొటోలు కూడా దిగారు.
అయితే ఈ ఫోటోను మహమ్మద్ కైఫ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘ఎట్టకేలకు కత్రినాను కలుసుకున్నాను. ఇప్పటి వరకు మా మధ్య ఎలాంటి బంధుత్వం లేదు. మానవత్వం తప్ప’ అంటూ కత్రినాతో దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.
ఈ ఫొటో వైరల్ అవుతోంది. కైఫ్ ద్వయంను ఒకే దగ్గర చూడాలన్న అభిమానుల కోరిక ఇన్నాలకు తీరిందని నెటిజన్లు కాంమెంట్లు చేస్తున్నారు. ఇక కత్రినా కైఫ్ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో కలిసి ‘భారత్’ సినిమాలో నటించింది. రంజాన్ పండుగ కానుకగా ఈ చిత్రం రిలీజ్ అయి సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతుంది.
Finally the Kaif’s meet.
PS- As clarified earlier, abhi tak koi rishta nahi , except insaaniyat kapic.twitter.com/5lK1cLHlEq
— Mohammad Kaif (@MohammadKaif) June 4, 2019