Mogudu:’మొగుడు’..టైటిల్ ప్రోమో

2
- Advertisement -

తమిళ స్టార్ హీరో విశాల్ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇది ఆయన కెరీర్‌లో 36వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్‌ను చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. ఈ చిత్రానికి హిట్ డైరెక్టర్ సుందర్ సి దర్శకత్వం వహించనుండగా, వీరిద్దరి కలయికలో వస్తున్న నాలుగో సినిమా ఇదే. ఈ సినిమాకు తెలుగులో “మొగుడు” అనే ఆకట్టుకునే టైటిల్‌ను ఖరారు చేస్తూ తాజాగా ప్రోమోను విడుదల చేశారు.

గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన మగ మహారాజు, మదగజరాజా, యాక్షన్ సినిమాల మాదిరిగానే ఈ చిత్రం కూడా భారీ అంచనాలతో రూపొందుతోంది. ఈ సినిమాలో తమన్నా భాటియా హీరోయిన్‌గా నటిస్తుండగా, యోగిబాబు కీలక పాత్రలో ప్రేక్షకులను నవ్వించనున్నారు. విడుదలైన ప్రోమో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మాస్ యాక్షన్‌తో ఆకట్టుకుంటోంది.

‘మొగుడులా ఉండటం ముఖ్యం కాదు.. మొగుడు మొగుడులా ఉండటమే ముఖ్యం’ అనే డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తుండగా, ACS అరుణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -