Bharat:మైనార్టీ హక్కులపై మోదీ స్పందన..

52
- Advertisement -

అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ప్రజాస్వామ్యం, మైనార్టీ హక్కులు, భావప్రకటన స్వేచ్చ విషయాలపై చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా యూఎస్‌ మీడియా అడిగిన ప్రశ్నకు మోదీ సమాధానం ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌తో ద్వైపాక్షిక చర్చల అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో మోదీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మోదీని ఇండియాలో మైనార్టీల హక్కులను మెరుగుపరచడానికి భారత్‌ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని అడిగారు. దీనికి ప్రధాని మోదీ స్పందిస్తూ…మీరు అడిగిన ప్రశ్న నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మనమంతా ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యం మన రక్తంలో నిండిపోయింది. దానినే మనం శ్వాసిస్తున్నాం. అది మన రాజ్యంగంలోనే ఉంది. మానవ విలువలు, హక్కులు లేకపోతే ప్రజాస్వామ్యం ఉండదు. మనం ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నప్పుడు…వివక్ష అనే ప్రశ్న ఉండదని జవాబు ఇచ్చారు.

Also Read: బిహార్‌లో విపక్షాల భేటీ..

సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్‌ అనే నినాదం మీదే తమ ప్రభుత్వం నడుస్తోందని అన్నారు. మతం, కులం, వయసు, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు.

Also Read: CMKCR:నిరంతరం మదిలో ఉంటారు..

- Advertisement -