- Advertisement -
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారు మారు కావడం ఖాయమన్నారు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి 100వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని డీఎంకే కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సోనియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరుణానిధికి నివాళులర్పించారు.
ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎన్డీయేకు అనుకూలంగా రావడంపై స్పందించిన సోనియా.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎన్నికల ఫలితాలకు పూర్తి విరుద్ధంగా ఉంటాయని అన్నారు.ఎన్నికల ఫలితాలపై ప్రతిపక్ష ఇండియా కూటమి ఆశాభావంతో ఉందన్నారు. ఎ జూన్ 4న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారవుతాయని భావిస్తున్నామని…ఫలితాలు వచ్చే వరకు వేచి చూస్తామన్నారు.
Also Read:రాష్ట్రాన్ని తాకిన నైరుతి..
- Advertisement -