ఒకే వేదికపై మోడీ,పవన్,లోకేష్‌!

16
- Advertisement -

ఏపీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ఇవాళ కూటమి తరపున ప్రచారం చేయనున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. రాజమండ్రిలో విజయ శంఖారావం పేరుతో జరిగే ఈ సభలో ఒకే వేదికపై సందడి చేయనున్నారు మోడీ, పవన్, లోకేష్.

ప్రధాని మోదీ జగదల్‌పూర్ విమానాశ్రయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.25 గంటలకు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుంటారు. రాజమండ్రి విమానాశ్రయం నుండి 2.30 గంటలకు హెలికాప్టర్ బయలుదేరి 2.50 గంటలకు వేమగిరి హెలిప్యాడ్‌కు చేరుకుంటుంది.

3 గంటలకు మోడీ బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 నుంచి 3.45 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3.55 గంటలకు వేమగిరి హెలిప్యాడ్‌లో బయలుదేరిన ప్రధాని మోదీ 4.55 గంటలకు అనకాపల్లి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. బహిరంగ సభకు రెండు లక్షల మంది వస్తారన్న అంచనా వేస్తున్నారు.

Also Read:Rahul:ప్రతి పేద కుటుంబానికి లక్ష సాయం

- Advertisement -