తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌కు 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. సినీ పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆయనకు ప్రత్యేక అభినందనలు కూడా తెలిపారు.
డిసెంబర్ 12, 2025న రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా మోదీ తన X (మునుపటి ట్విట్టర్) ఖాతాలో ప్రత్యేక సందేశం పోస్టు చేశారు. రజినీకాంత్ సినీ ప్రస్థానం, ఆయన నటనలోని వినూత్నతను ప్రశంసిస్తూ, దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా ఉండాలని ఆశీర్వదించారు.
రజినీకాంత్ జీకి 75వ జన్మదిన శుభాకాంక్షలు. ఆయన నటన తరతరాలను అలరించి, అపారమైన అభిమానాన్ని అందుకుంది. వివిధ పాత్రలు చేస్తూ ఎప్పటికప్పుడు కొత్త ప్రమాణాలు నెలకొల్పారు. ఈ ఏడాది ఆయన సినీ పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తిచేసుకోవడం ప్రత్యేకం. ఆయన దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాను అని మోదీ తెలిపారు.
అలాగే తమిళనాడు సీఎం ఎం.కే. స్టాలిన్, నటుడు ధనుష్ సహా అనేక సినీ–రాజకీయ ప్రముఖులు కూడా సామాజిక మాధ్యమాల ద్వారా రజినీకాంత్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
Also Read:AP:అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

