జవాన్లతో మోడీ దీపావళి

333
- Advertisement -

ఆర్మీతో పాటే దేశం మొత్తం నడవాలంటున్న ప్రధాని మోడీ.. దీపావళి వేడుకలను వారితోనే సెలబ్రేట్ చేసుకునేందుకు ప్లాన్ చేశారు. ఉత్తరాఖండ్‌లోని చమోలీలో ఇండో టిబెటన్ సరిహద్దులో దివాళీ చేసుకోనున్నారు మోడీ. అక్కడి పోలీసు దళంతో కలిసి ఆయన ఈ ఏడాది పండుగ చేసుకుంటున్నారు. శనివారం ఉత్తరాఖండ్ బయలుదేరుతున్న ఆయన.. అక్కడే సైనికులతో గడపనున్నారు. ప్రధాని మోడీతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా వెళ్తున్నారు.

ప్రధానిగా ఆయన తన తొలి దీపావళిని 2014వ సంవత్సరంలో సియాచిన్లో జరుపుకున్నారు. గత ఏడాది దీపావళి నాడు పంజాబులోని పాకిస్థానీ సరిహద్దుల వద్ద జవాన్ల మధ్య గడిపారు. ఈసారి చైనా సరిహద్దుల్లో దీపావళి జరుపుకోవడం వ్యూహాత్మక నిర్ణయంగా భావిస్తున్నారు. మణ అనేది భారత భూభాగంలో అత్యంత శివారున 10వేల అడుగుల ఎత్తున సరిహద్దులను ఆనుకుని ఉన్న కీలకమైన కుగ్రామం. మోడీతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా మణ వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆయన భద్రినాథ్ పుణ్యక్షేత్రాన్ని కూడా సందర్శించే అవకాశం ఉంది.

narendra-modi_4c5d14e4-9d23-11e6-a83e-3795272c0142

సైనికులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపే కార్యక్రమా న్నిమోడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. మైగర్నమెంట్‌.ఇన్‌ వైబ్‌సైట్‌, మోడీ యాప్‌తో పాటు ఆల్‌ ఇండియా రెడియో, దూర దర్శన్‌ ద్వారానూ సైనికులకు దీపావళి శుభాకాం క్షలను ప్రజలు తెలపవచ్చని సూచించారు. దీపావళి పండుగ నాడు సైనికులపై ప్రత్యేక దృష్టి పెట్టడం ఇదే తొలిసారి కాదు. గత రెండు దీపావళి పండుగలకు మోడీ ఈ విథంగానే చేశారు.

PMModi

- Advertisement -