- Advertisement -
కరోనా కట్టడికి కేంద్రం విధించిన లాక్ డౌన్ ఏప్రిల్ 14తో ముగియనుంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ పొడగింపుపై ఇప్పటికే రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపిన కేంద్రం…దీనిపై మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది.
లాక్‌డౌన్‌ను పొడిగిస్తే ఏయే అంశాల్లో వెసులుబాటు కల్పించాలి, ఏయే విషయాల్లో కఠినంగా వ్యవహరించాలి అనే దానిపై తీవ్ర కసరత్తు చేస్తోంది. ప్రజారోగ్యం, జీవనోపాధి రెండింటినీ సమన్వయం చేస్తూ ప్రణాళిక రూపొందిస్తున్నది.
ప్రత్యేక అనుమతులతో ప్రత్యేక బస్సులు, రైళ్లలో వలస కూలీలను స్వస్థలాలకు పంపే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. పంట కోత, పంట ఉత్పత్తుల అమ్మకాలకు అడ్డు లేకుండా చర్యలు చేపడుతోంది. ప్రజారోగ్యం కాపాడుతూ, పరిశ్రమలను తెరిచేలా ఏర్పాట్లు చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
- Advertisement -