ఉగ్రవాదాన్ని సమూలంగా అరికట్టాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. షాంఘై ఆర్థిక సదస్సులో ప్రసంగించిన ప్రధాని మోదీ..ఉగ్రవాదుల ఆర్థిక మూలలను మరింతగా దెబ్బ కొట్టాలని వెల్లడించారు.
ఉగ్రవాదం, వేర్పాటువాదం సవాళ్లుగా మారాయి అని… ఉగ్రవాద సమస్యలతో భారత్ 4 దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతోంది అన్నారు. ఇది ఒక దేశ భద్రతకు మాత్రమే సవాల్ కాదు.. మానవాళి మొత్తానికి ఉమ్మడి సవాల్‌గా మారిందన్నారు.
దీనిపై పోరులో దేశాలన్నీ ఐక్యంగా నిలవాలి… అల్‌ఖైదా, అనుబంధ సంస్థలతో పోరులో భారత్ చొరవ చూపింది అన్నారు. కొన్ని దేశాలు ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతిచ్చాయి… పుల్వామా ఉగ్రదాడి ఉగ్రవాదం యొక్క వికృత రూపాన్ని ప్రపంచానికి చూపించింది అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంలో మనకు మద్దతుగా నిలిచిన అన్ని మిత్ర దేశాలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను… ఉగ్రవాదాన్ని ఒకే స్వరంతో ఖండించాలి… ఉగ్రవాదంపై మనకు ద్వంద్వ వైఖరులు ఉండకూడదు అన్నారు.
Also Read:తాడిపత్రి మాకు దేవాలయం!

