భారతదేశం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. రష్యాలో రెండోరోజు పర్యటన సందర్భంగా భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన మోడీ…మూడు రెట్లు వేగంగా పనిచేయాలని అప్పుడే నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
తాను ఒక్కడినే ఇక్కడికి రాలేదని.. 140 కోట్ల మంది ప్రేమను తీసుకొచ్చానని తెలిపారు. భారత్‌ను మూడో ఆర్థిక శక్తిగా నిలబెడతానని వెల్లడించారు. డిజిటల్ పేమెంట్లలో సరికొత్త రికార్డ్‌లను సృష్టించాం…. స్టార్టప్‌ల్లో ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకున్నాం అన్నారు.
2014లో వందల్లో ఉన్న స్టార్టప్‌లు నేడు లక్షల్లోకి చేరాయని… చంద్రుని దక్షిణధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా గుర్తింపు పొందాం అన్నారు. భారత్ రికార్డు స్థాయిలో పేటెంట్లను సాధిస్తోందని…. ప్రపంచంలో అతిపెద్ద ఆరోగ్య బీమా వ్యవస్థ భారత్‌లో ఉందని వెల్లడించారు.టీ20 వరల్డ్ కప్ గెలిచి దేశం సంబరాలు చేసుకుంది… భారత్ ఘనతను ప్రపంచం గుర్తించక తప్పని పరిస్థితికి తెచ్చాం అన్నారు.
Also Read:ఈ రెండు అలవాట్లతో సంతానలేమి సమస్యే!