కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ అవిశ్వాసం వీగిపోయిన విషయం తెలిసిందే. అవిశ్వాసానికి తగిన మెజార్టీ రావడంతో ఎన్టీఏ ప్రభుత్వం నెగ్గింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ సుమారు గంటసేపు మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచారు. కర్ణాటక మాజీ సీఎం, ప్రధాని మోడీపై కన్నడ ఎన్నికల సమయంలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి అనర్గళంగా 15 నిమిషాలు మాట్లాడాలని సవాల్ చేశారు.
ఈ సందర్భంగా గత శుక్రవారం మోడీ లోక్ సభలో సుమారు గంటసేపు మాట్లాడి కొందరికి సరైన సమాధానం చెప్పారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రధాని స్పీచ్ పై పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ మోడీని అభినందిస్తూ.. అంతా బాగానే ఉంది కానీ ఒకే ఒక్క విషయం మోడీజీ… మీరు ఇంకా నవ్వాలని ట్వీట్ చేశాడు.
ఎంతో మంది ఫాలోవర్లు కలిగిన మోడీ సాధారణంగా ఎక్కువగా ఎవరకి తిరిగి సమాధానం ఇవ్వరు. కానీ ఈ నెటిజన్ చేసిన ట్వీట్ కి స్పందించాడు. ఈ పాయింట్ ను గుర్తుపెట్టుకుంటాను అని ట్వీట్ చేశాడు. మరో వ్యక్తి స్వచ్చ భారత్ పై తన కూతురు రాసిన వ్యాసానికి బహుమతి వచ్చిందని ట్వీట్ చేయగా.. చాలా ఆనందం మీ కుమార్తెకు తన తరపున అభినందలు తెలియజేయండి అంటూ ట్వీట్ చేశాడు. నిన్న ఆదివారం చాలా మంది నెటిజన్లకు మోడీ రిప్లై ఇవ్వడం విశేషం.