ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం

2
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం దక్కింది. కరేబియన్ దేశం కామన్వెల్త్ ఆఫ్ డొమినికా…. తమ దేశ అత్యున్నత జాతీయ అవార్డును మోదీకి అందజేసింది. డొమినికా అధ్యక్షురాలు సిల్వానీ బర్టన్..మోదీని డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్ తో సత్కరించారు.

కొవిడ్ -19 సంక్షోభ సమయంలో మోదీ ఆ దేశానికి అందించిన మద్దతు, భారత్ – డొమినికా దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ అత్యున్నత పురస్కారంతో సత్కరించామని సిల్వానీ బర్టన్ తెలిపారు. మోదీ చేసిన కృషికిగాను డొమినికా అత్యున్నత పురష్కారంతో సత్కరించారు.డొమినికా అత్యున్నత జాతీయ అవార్డుతో సత్కరించడం గౌరవంగా భావిస్తున్నాను అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ పురస్కారాన్ని 140 కోట్ల మంది భారత ప్రజలకు అంకితం చేస్తున్నానని వెల్లడించారు.

అలాగే గయానా దేశం…మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ఎక్స్ లెన్స్’ను అందజేసింది.

Also Read:KTR:అదానీతో చీకటి ఒప్పందాలు బయటపెట్టాలి

- Advertisement -