తెలంగాణలో చేపడుతోన్న మిషన్ భగీరథ, స్వచ్ఛభారత్ కార్యక్రమాలను ప్రశంసిస్తూ ప్రధాని మోడీ మంత్రి కేటీఆర్‌కు లేఖ రాశారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం పట్ల స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ సందర్బంగా కేటీఆర్‌ని ప్రదాని నరేంద్ర మోడీ అభినందించారు. రాష్ట్రంలో మిషన్ భగీరథ, స్వచ్ఛభారత్ కార్యక్రమాలు సమర్థవంతంగా చేపడుతున్నారని పేర్కొన్నారు మోడీ. మరికొన్ని రోజుల్లో మహాత్మా గాంధీ జయంతి రానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతోన్న ‘స్వచ్ఛత హి సేవా’ ఉద్యమంలో పాల్గొనాలని కేటీఆర్‌ను ఆహ్వానించారు.
తెలంగాణలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం పట్ల స్ఫూర్తిని కొనసాగించాలని, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యపడుతుందని వివరించారు.దేశ వ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కేటీఆర్ తన అనుభవాలను నరేంద్ర మోడీ యాప్‌లో పంచుకోవాలని ఆయన చెప్పారు.