అమెరికా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్‌కు చెందిన అక్రమ వలసదారులపై సంచలన ప్రకటన చేశారు. ఒక దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కులేదని తేల్చిచెప్పారు. డబ్బు, ఉద్యోగాలు ఆశజూపి కొంతమంది యువత, పేదరికంలో ఉన్నవారిని కొంతమంది మోసం చేస్తున్నారని తెలిపారు.
చట్ట విరుద్ధంగా అమెరికాలో నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని స్పష్టం చేశారు. మానవ అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరగాల్సి ఉందని ఇది ఎవరు చేసిన స్వాగతించాలన్నారు . ఒకదేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు ఉండదని..ఈ ప్రయత్నాల్లో ట్రంప్ కు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
#WATCH | Washington, DC: On the illegal immigration issue, PM Narendra Modi says, “…Those who stay in other countries illegally do not have any legal right to be there. As far as India and the US are concerned, we have always said that those who are verified and are truly the… pic.twitter.com/Qa0JEnAjyp
— ANI (@ANI) February 13, 2025
Also Read:డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోడీ భేటీ..

