మోడీ ప్రమాణస్వీకారం..డేట్ ఫిక్స్!

19
- Advertisement -

ఈ నెల 9వ తేదీన ప్రధానిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు నరేంద్ర మోడీ. సాయంత్రం 6 గంటలకు కర్తవ్య పద్‌లో ప్రధానమంత్రిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్న ఎన్డీఏ కూటమి పార్టీల నేతలు, బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఇతర దేశాల అధ్యక్షులు, ప్రధానులకు కూడా ఆహ్వానం పలికింది బీజేపీ.

ఈసారి ఎన్డీయే కూటమిలో కీలక పాత్ర పోషించనున్నారు చంద్రబాబు, నితీశ్ కుమార్. వీరి పార్టీలు టీడీపీ, జేడీయూలకు కేబినెట్‌లో ఎక్కువ ప్రాధాన్యం ఉండే అవకాశం ఉంది. ఈ రెండు రోజుల్లో మోడీతో పాటు కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే వారి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Also Read:వయనాడ్‌కు రాహుల్ బైబై!

- Advertisement -