భారతీయ రాజకీయరంగంలో ఏ నాయకుడికి లేని ఫాలోయింగ్ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఉందని చెప్పవచ్చు.ఇక ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే మోడీకి ఫాలోవర్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. సోషల్ నెట్‌వర్కింగ్ రాజకీయం కూడా మోడీ ద్వారానే అమల్లోకి వచ్చిందనే వాళ్లూ ఉన్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రధానమంత్రి నరేంద్రమోడీకి 24 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.మోడీ ప్రధాని అయ్యాక ట్విట్టర్లో ఆయన్ను ఫాలో అయ్యేవారి సంఖ్య రెట్టింపయింది. ఇక పాలన అంశాలతో పాటు విదేశీ టూర్ల విషయాలను ట్విట్టర్లో షేర్ చేసుకుంటున్నారు నమో.
ఇక ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇటీవల తీసుకున్న సంచలన నిర్ణయంతో నల్లకుబేరులు షేక్ అయ్యారు. రూ.500,రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. దీంతో తొలుత సోషల్ మీడియాలో నమోపై ప్రశంసలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియా మొత్తం నమో జపం చేసింది. కానీ నోట్ల రద్దు తర్వాత తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవడంలో విఫలం కావటంతో సీన్ రివర్సైంది. మోడీ ట్విట్టర్ అకౌంట్‌ను ఏకంగా 3,13,312 మంది అన్ ఫాలో చేశారు. దీంతో సోషల్ మీడియాలో మోడీ గ్రాఫ్ అమాంతంగా పడిపోయింది.
దీనిపై నెటిజన్లు,ప్రజల నుంచి తీవ్రనిరసన వ్యక్తమవుతోంది. తొలిరోజు ఉదయం కొత్తనోట్ల సరఫరా కొంతమేరకు సజావుగానే జరిగినప్పటికి రెండోరోజు మాత్రంపలు ప్రాంతాల్లో ఏటీఎంల వద్ద కిలోమీటర్ల కొద్దీ కస్టమర్ల క్యూలైన్లు కనిపిస్తుండగా, మధ్యాహ్నం అయినా, తెరచుకున్న ఏటీఎంల సంఖ్య వేళ్ల మీద లెక్కించేంత మాత్రమే ఉంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు బ్యాంకుల్లో కస్టమర్ల క్యూ కొనసాగుతునే ఉంది.
ఇక ఒక్కరికీ రూ.4000 మాత్రమే బ్యాంకు జారీ చేస్తుండగా… రోజువారీ ఖర్చులకు తీసుకునేవాళ్ల దగ్గర్నుంచి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లు, పెళ్లిళ్ల లాంటి అవసరాల కోసం తీసుకునేవాళ్లు కూడా కొత్త నోట్ల కోసం అల్లాడుతున్నారు.ఇక ప్రతిపక్షాలు సైతం మోడీ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశాయి. పెద్ద నోట్ల రద్దుతో బ్లాక్ మనీని అరికట్టలేమని…ఇది మోడీ తీసుకున్న అసమర్థ నిర్ణయమని మండిపడ్డారు.ఈ నోట్ల రద్దు గురించి బిగ్ షాట్ అంబానీ మొదలుకొని…గుజరాత్ బడాబాబులకు,మోడీ సన్నిహితులకు ముందే తెలుసని… అందరు సర్దుకున్నాక….ఇదేదో నల్లధనాన్ని వెలికితీసేందుకు అంటూ మోడీ నాటకం మొదలుపెట్టారని సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. దీంతో ఏకంగా మోడీని అన్ ఫాలో అవుతున్న వారి సంఖ్య గంటగంటకు పెరిగిపోతోంది.