దుమ్మురేపుతున్న మోడీ ’షేప్‌ ఆఫ్‌ యూ’ పాట.. !

214
Modi is singing-Shape of you
Modi is singing-Shape of you
- Advertisement -

గత జనవరిలో ఎడ్‌ షీరాన్‌ ’షేప్‌ ఆఫ్‌ యూ’ విడుదలైన నాటి నుంచి ఆ వీడియో సాంగ్‌పై అనేక బాలీవుడ్‌ స్ఫూప్‌ వీడియోలు ఆన్‌లైన్‌లో దుమ్మురేపుతున్న విష‌యం తెలిసిందే.  షీరాన్‌ పాటపై సల్మాన్‌ ఖాన్‌ మొదలు గోవింద వరకు నటులు చేసిన డ్యాన్స్‌తో మిక్స్‌ చేసిన స్ఫూప్‌ వీడియోలు నెటిజన్లను అలరించగా.. తాజాగా ప్రధాన మంత్రి మోడీ మాటలు, హావభావాలను జోడించి మాషప్ వీడియో తరహాలో కేరళకు చెందిన టోనీ టార్జ్ ఓ పాటను రూపొందించారు. ‘షేప్‌ ఆఫ్‌ యూ’ పాటకు మోడీ మాటలను, హావభావాలను జోడించి ఆయన ఓ వీడియోను తయారు చేశారు. మోదీ పాటను యూట్యూబ్‌లో ఇప్పటికే లక్షల మంది చూశారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వంటి ప్రముఖుల సరసన  ప్రధాని మోడీ చేరారు. ఈ వీడియోను వీక్షించిన పలువురు ‘ఇండియాకు కూడా ఒకరు దొరికారు’ అంటూ మాషప్ను రూపొందించిన టార్జ్ను ప్రశంసిస్తున్నారు.  అద్భుతమైన ఎడిటింగ్..  భూమ్మీద అన్ని పదాలు ఎలా దొరికాయ్‌.. ఎడిటింగ్ నిజంగా నైట్‌మేర్‌ అంటూ నెటిజన్లు అభినందనల జల్లు కురిపిస్తున్నారు.

- Advertisement -