Modi:మూడో అతిపెద్ద స్టార్టప్‌…భారత్

7
- Advertisement -

న్యూఢిల్లీలో ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ కాంక్లేవ్‌లో పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశంలో సెమీకండక్టర్ రంగం గణనీయమైన వృద్ధిని సాధించిందని వెల్లడిచారు ప్రధాని. భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే మూడో అతి పెద్ద స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను కలిగి ఉందని అభివర్ణించారు

ఇరవయ్యొకటవ శతాబ్దంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు కలిసి ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్‌పై ఆలోచించి, దిశా నిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది. ఈ అవసరమే ఒక ఆలోచనకు పుట్టినిల్లు అయ్యింది. ఆ ఆలోచన నుంచే ఈ కాన్‌క్లేవ్‌ దృష్టికోణం రూపుదిద్దుకుంది అన్నారు.

ప్రారంభ కార్యక్రమం భాగంగా, మోదీ రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ (RDI) స్కీమ్ ఫండ్‌ను కూడా ప్రారంభించారు. రూ. 1 లక్ష కోట్లు విలువైన ఈ నిధి ప్రైవేట్ రంగం పరిశోధన మరియు అభివృద్ధిలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఉద్దేశించబడింది అని ప్రధానమంత్రి అన్నారు. ఈ రూ. 1 లక్ష కోట్లు మీ కోసం. ఇది మీ సామర్థ్యాలను పెంచటానికి, మీకు కొత్త అవకాశాలను తెరవటానికి. మా ప్రయత్నం ప్రైవేట్ రంగంలో కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్‌ను ప్రోత్సహించడమే అని వెల్లడించారు ప్రధాని.

ఈ కాన్‌క్లేవ్‌లో 11 ప్రధాన అంశాలపై చర్చలు మరియు సెషన్లు నిర్వహించబడుతున్నాయి. అధునాతన సాంకేతికత మరియు తయారీ, కృత్రిమ మేధస్సు, బయో-మ్యాన్యుఫ్యాక్చరింగ్‌, బ్లూ ఎకానమీ, డిజిటల్ కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్ & సెమీకండక్టర్ తయారీ, అభివృద్ధి చెందుతున్న వ్యవసాయ సాంకేతికతలు, ఇంధనం, పర్యావరణం & వాతావరణం, ఆరోగ్యం & వైద్య సాంకేతికతలు, క్వాంటం సైన్స్ & టెక్నాలజీ, మరియు అంతరిక్ష సాంకేతికతలు. ఈ రోజు ప్రారంభమైన ఈ మూడు రోజుల కార్యక్రమం భారత విజ్ఞాన మరియు సాంకేతిక రంగ పురోగతిని మరింత వేగవంతం చేయడమే లక్ష్యంగా కొనసాగుతుంది.

Also Read:BB9:మాధురి ఎలిమినేట్

- Advertisement -